AP Budget 2022: ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌.. కేటాయింపులపై సర్వత్రా ఉత్కంఠ.. నవరత్నాలకు పెద్దపీట వేసే ఛాన్స్!

|

Mar 11, 2022 | 6:52 AM

మరికాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బడ్జెట్‌లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు ఏపీ ప్రజలు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

AP Budget 2022: ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌.. కేటాయింపులపై సర్వత్రా ఉత్కంఠ.. నవరత్నాలకు పెద్దపీట వేసే ఛాన్స్!
Ap Budget
Follow us on

Andhra Pradesh Budget 2022 session: మరికాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బడ్జెట్‌లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు ఏపీ ప్రజలు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి(Buggana Rajendranath Reddy) రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబాబు(Kanna Babu) వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకున్నా.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు సీఎం జగన్‌. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. ఈ సారి రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున బడ్జెట్‌లో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో ముఖ్యంగా నవరత్నాలకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న పథకాలతోపాటు కాకుండా కొత్తవాటికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయా అనేది చర్చనీయాంశమైంది. బడ్జెట్‌లో అన్నిరంగాలకు ప్రాధాన్యమిచ్చేలా కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైద్యం, విద్యపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు సమాచారం. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఉండనున్న బడ్జెట్‌కు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

Read Also… 

AP Jobs: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. శుక్రవారం భారీ జాబ్‌ మేళా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..