Heat Waves: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపం.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిక

|

Apr 02, 2024 | 6:48 AM

వారంరోజులుగా టెంపరేచర్స్‌ పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. నేటి నుంచి ఉష్ణోగ్రతలు  మరింత పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. మరి ఏప్రిల్ మొదటి రోజునే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలాగుంటుంది? ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళనలు రేపుతోంది. ఎందుకంటే అసలుసిసలు ఎండాకాలం ముందుంది.

Heat Waves: నేటి నుంచి ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపం.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిక
Imd Warns Of Heatwaves
Follow us on

ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త.!. అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకండి. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలకు డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ. రోజు రోజుకీ
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటలకే చెంప చెళ్లుమనిపిస్తూ… 8 గంటలకల్లా చుక్కలు చూపిస్తున్నాడు. సెగలు కక్కుతోన్న సూరీడు, పది గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు సెగలు రేపుతున్నాడు. వారం రోజులుగా ఏపీ, తెలంగాణలో ఎక్కడచూసినా ఇదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఉదయం 11గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే సూర్యుడి విశ్వరూపం ఏ రేంజ్‌లో ఉందో అర్థంచేసుకోవచ్చు.

ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే, ఇంకోవైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 37 మండలాలకు వార్నింగ్‌ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతోంది ఐఎండీ.

వారంరోజులుగా టెంపరేచర్స్‌ పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. నేటి నుంచి ఉష్ణోగ్రతలు  మరింత పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. మరి ఏప్రిల్ మొదటి రోజునే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలాగుంటుంది? ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళనలు రేపుతోంది. ఎందుకంటే అసలుసిసలు ఎండాకాలం ముందుంది. మున్ముందు ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించడానికి కూడా భయమేస్తుంది మరి.

ఇవి కూడా చదవండి

ఉష్ణోగ్రతలకు తోడు, వడగాల్పులు కూడా ఊహించని స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తోంది IMD. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు శాంపిల్స్‌ మాత్రమేనని, ముందుముందు ఇంకా పెరుగుతాయంటోంది. ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌ తర్వాత నిప్పుల కుంపటేనని హెచ్చరిస్తోంది. రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. అందుకే  అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతోంది IMD.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..