Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త.. మరికాసేపట్లో వారి ఖాతాల్లో డబ్బులు..!

|

Jun 14, 2022 | 6:15 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త.. మరికాసేపట్లో వారి ఖాతాల్లో డబ్బులు..!
Cm Jagan
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సంబంధిత సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి శ్రీసత్య సాయి జిల్లా వేదిక కానుంది. నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, ఈ పథకం కింద.. రాష్ట్రవ్యాప్తంగా 15,60,763 మంది రైతులకు రూ. 2,977 కోట్ల రూపాయల పంట బీమాను అందిస్తోంది సర్కార్‌.