Andhra Politics: అమరావతి, రుషికొండ భవనాలపై రగడ.. మండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

రుషికొండపై ఢీ అంటే ఢీ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. రుషికొండ భవనాలకు చదరపు అడుగుకి 26 వేలు ఖర్చుపెట్టి ప్రజాధానం దుర్వినియోగం చేశారని అచ్చెన్నాయుడు విమర్శిస్తే .. ఆ భవనా ల నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు బొత్స సత్యన్నారాయణ..

Andhra Politics: అమరావతి, రుషికొండ భవనాలపై రగడ.. మండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
Botsa Satyanarayana Kinjarapu Atchannaidu

Updated on: Mar 03, 2025 | 9:05 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాల హయాంలో పాలన, అభివృద్ధిపై వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు
ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా విశాఖ రుషికొండ భవనాల వ్యవహారం మీద అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనాలకు పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారని వైసీపీ ఎమ్మెల్సీలు విపర్శించారు. దీంతో అధికార కూటమి నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. విశాఖలో రుషికొండ భవనాలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయలేదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

అయితే రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ ఎందుకు జరపడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు తాత్కాలికం కాకపోతే.. మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని అందుకే వైసీపీ హయాంలో నిర్మాణాలు చేసినా బిల్లులు చెల్లించామని అన్నారు. అమరావతి సచివాలయం ఇతర భవనాలు తాత్కాలిక భవనాలు అని ఎవరు చెప్పారని అవి శాశ్వత భవనాలేనని అని అచ్చెన్నాయుడు బదులిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..