CM Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం (EHS) లో మరో 46 రకాల క్యాన్సర్ చికిత్స విధానాలను శాశ్వతంగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం...

CM Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఉత్తర్వులు జారీ
CM Jagan

Updated on: Apr 20, 2023 | 9:56 AM

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యస్ చెప్పింది.  ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లోకి కొత్తగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలని శాశ్వతంగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. అంటే.. వీటిని ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిన పని కూడా ఉండదు. మెడికల్ ఆంకాలజీలో 32, సర్జికల్ ఆంకాలజీలో 10,  రేడియేషన్ ఆంకాలజీలో 4 చికిత్సలను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో శాశ్వతంగా చేర్చింది ప్రభుత్వం. దీంతో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పాయి. ఈ చికిత్సలు ప్రజంట్.. సర్వీస్‌లో ఉన్న ఎంప్లాయిస్‌తో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకి సైతం అనుబంధ హాస్పిటల్స్‌లో అందేలా చూడాలని సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు సూచించారు.

హెల్త్ కార్డు కలిగిన ఉద్యోగులందరూ కొత్తగా చేర్చిన క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చు. ఏమైనా వివరాలు తెలసుకోవాలంటే..  www.ysraarogyasri.ap.gov.in  లోకి వెళ్లి తెసుకోవచ్చు. లేదంటే.. 18004251818 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసకోవచ్చు. లేదా ఏదైనా నెట్‌వర్క్ హాస్పిటల్ లోని ఆరోగ్య మిత్ర ద్వారా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

అటు పేదలకు వర్తించే ఆరోగ్యశ్రీ సేవల్లోను కీలక మార్పులు చేసింది ప్రభుత్వం.. వేల సంఖ్యలో కొత్త వ్యాధులను చేర్చింది. రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..