అమరావతి…సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి, జీపీఎస్ తీసుకు వచ్చినందుకు అభినందనలు తెలియజేశారు ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, ఇతర ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…ఎంప్లాయీస్‌కి మంచి చేసేందుకు ప్రతి అడుగులోనూ ప్రయత్నించామన్నారు. వ్యత్యాసాలు తగ్గించి అందరికీ మనస్ఫూర్తిగా మేలు జరగాలన్న సదుద్దేశ్యంతో ఉద్యోగుల డిమాండ్లపై దృష్టిపెట్టామన్నారు. అలాగే…ఉద్యోగుల విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం ఇదన్నారు జగన్. పెన్షన్ సహా కొన్ని సమస్యల పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపన పడ్డామనీ, భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకొని, జీపీఎస్‌ను తీసుకువచ్చామనీ వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను నిలబెట్టేలా GPS ను రూపొందించామని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్. 62 ఏళ్లకు రిటైర్‌అయితే మరో రెండు దశాబ్దాలకు ఉపయోగపడేలా, 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండేలా ప్రణాళికను రూపొందించామన్నారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామని తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఓ వైపు ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు దాన్ని కొనసాగించే పరిస్థితులూ ఉండాలి. ఇదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
సీపీఎస్ లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయన్న సీఎం…రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసిందని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపైన కూడా మంచి ఆలోచనలు చేశామన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను సైతం పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు మేలు జరిగేలా చూశామన్నారు.
ఉద్యోగులకు ఎంతవీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం. జీపీఎస్కోసం రెండేళ్లుగా కసరత్తు చేశాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు, వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారు: సీఎం https://t.co/dGdbiQXFSJ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 9, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం