Andhra Curfew: ఏపీలో అమ‌ల్లోకి వ‌చ్చిన క‌ర్ఫ్యూ.. వేటికి మిన‌హాయింపు ఉందంటే

|

May 05, 2021 | 3:58 PM

ఏపీలో కరోనా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాల పాటు ప్రతీరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది..

Andhra Curfew: ఏపీలో అమ‌ల్లోకి వ‌చ్చిన క‌ర్ఫ్యూ.. వేటికి మిన‌హాయింపు ఉందంటే
Lockdown in ap
Follow us on

ఏపీలో కరోనా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాల పాటు ప్రతీరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది. మే 5 నుంచి 18 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే, కర్ఫ్యూ నిబంధనల నుండి కొన్నింటికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఏపీలో కర్ఫ్యూ నుంచి బ్యాంకులు, జాతీయ రహదారి పనులకు, పోర్టులకు మినహయింపు ఇస్తూ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు సవరణ ఉత్తర్వులను జారీ చేశారు.

మినహాయింపులు :

  • వ్యవసాయ పనులు
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్
  • విద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు
  • అంబులెన్స్, ఎమర్జెన్సీ వాహనాలు, వ్యాక్సిన్ కోసం వెళ్లేవారు
  • అత్యవసర సేవలందించే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • మెడికల్ షాప్స్, ఆస్పత్రులు, వైద్యారోగ్య సిబ్బంది
  • పెట్రోలు పంపులు, ఎల్ పీజీ, సీఎన్‌జీ, గ్యాస్ విక్రయ కేంద్రాలు

ఇకపోతే, మే 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం12 గంటల‌ వరకే వ్యాపారాలు, రవాణాకు అనుమతి ఇచ్చారు. తర్వాత అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే 12 తర్వాత అనుమతి ఇవ్వనున్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన కారణం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని..లేదంటే వెనక్కి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా అదుపులోనే ఉందిః సీఎస్

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ పరిస్థితులు.. క‌రోనా రోగుల‌కు బెంచ్ ల‌పైనే చికిత్స‌