AP News: జూదంలో పింఛన్ డబ్బు పోగొట్టి.. కట్టుకథ అల్లి.. అడ్డంగా బుక్కైన గ్రామ వాలంటీర్‌!

|

Aug 03, 2023 | 9:53 AM

వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బుతో జూదమాడి కాజేశాడు ఓ గ్రామ వాలంటీర్‌. ఆనక ఆ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి ఎత్తుకెళ్లినట్లు కట్టుకథ అల్లాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో గ్రామ వాలంటీరు బూటకం కథ వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా విడపనకల్లులో బుధవారం (ఆగస్టు 3) వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

AP News: జూదంలో పింఛన్ డబ్బు పోగొట్టి.. కట్టుకథ అల్లి.. అడ్డంగా బుక్కైన గ్రామ వాలంటీర్‌!
Volunteer Gambled With Old Age Pension
Follow us on

ఉరవకొండ, న్యూస్‌టుడే: వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బుతో జూదమాడి కాజేశాడు ఓ గ్రామ వాలంటీర్‌. ఆనక ఆ డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించి ఎత్తుకెళ్లినట్లు కట్టుకథ అల్లాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో గ్రామ వాలంటీరు బూటకం కథ వెలుగులోకొచ్చింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా విడపనకల్లులో బుధవారం (ఆగస్టు 3) వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

ఉవకొండ మండలం విడపనకల్లుకు చెందిన ఓ గ్రామవాలంటీరు ఆగస్టు 1న మధ్యాహ్నం పింఛన్లు పంపిణీ కోసం అధికారులనుంచి రూ.89 వేల నగదు తీసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా నగదుతో కర్నూలు జిల్లా గుమ్మనూరు సమీపంలోని జూద శిబిరం వద్దకు వెళ్లి మంగాపత్త ఆడాడు. ఆటలో తన వద్ద ఉన్న పింఛన్‌ డబ్బుతో పాటు వేలికున్న బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడు. ఉట్టిచేతులతో బయటికి వచ్చిన సదరు వాలంటీర్‌ ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు కట్టుకథ అల్లాడు. కొందరు దుండగులు డబ్బు ఎత్తుకెళ్లారని తండ్రితో కలిసి పోలీస్‌ స్టేషన్‌ల్‌ ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో అడ్డంగా బుక్కై..

పింఛన్ పంచడానికి నగదుతో వెళుతుండగా రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు తనను అడ్డగించి రూ.20 వేల నగదు ఇస్తే ఆ మొత్తాన్ని ఫోన్‌పే చేస్తామని చెప్పగా.. తాను రూ.వెయ్యికి రూ.పది కమీషన్‌ ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చాడు. అందుకు ఒప్పుకున్న ఆ వ్యక్తులు కర్ణాటక సరిహద్దులోని ఓ గ్రామానికి తనను తీసుకెళ్లి బెదిరించారనీ.. తన వద్ద ఉన్న పింఛన్‌ నగదుతోపాటు, వేలి ఉంగరం, సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారని పోలీసుల ఎదుట తెలిపాడు. పోలీసులు విచారించగా అసలు సంగతి బయటపడింది. ఈ విషయం బయటకు రాకుండా కొందరు నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.