
రోజురోజుకు ప్రజలు రాజకీయ నాయకులను అడిగే కోరికలు ఎంత విచిత్రంగా ఉన్నాయో… అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. రేషన్ కార్డ్ ఇప్పించమని.. పెన్షన్ వచ్చేలా చేయమని.. నల్లా కనెక్షన్ల కోసమని, విద్యుల్ లైట్లు లేవని.. తమ ప్రాంతానికి రోడ్డు కావాలని.. ఇలా అనేక సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేలను కలుస్తూ ఉంటారు… కానీ ఓ టీడీపీ కార్యకర్త భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇస్తున్నట్లే…. భార్య చనిపోయిన భర్తలకు కూడా పెన్షన్ ఇవ్వాలని అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిని కోరాడు.
సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం తక్కలపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఓ టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే బండారు శ్రావణిని ఓ వింత కోరిక కోరాడు. భర్త చనిపోయిన భార్యలకు పెన్షన్ ఇస్తున్నట్లే…. భార్య చనిపోయిన భర్తలకు పెన్షన్ ఇప్పించాలని విన్నవించాడు. సాధారణంగా ఇలాంటి విచిత్రమైన కోరిక కోరితే ఎమ్మెల్యేలు కూడా కంగు తింటారు… కానీ అటు ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా ఆ కార్యకర్త కోరికను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని… భార్య చనిపోయిన భర్తలకు పెన్షన్ ఇవ్వాలన్న అంశాన్ని ముఖ్యమంత్రిని కోరతానని చెప్పడం… అక్కడున్న అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. కుటుంబ పెద్ద అయిన సంపాదించే భర్త చనిపోతే… అతని మీద ఆధారపడ్డ భార్యకు ఆసరాగా పెన్షన్లు ఇస్తారు… కానీ ఇక్కడ భార్య చనిపోయిన భర్తకు పెన్షన్ ఎలా సాధ్యం అబ్బా???? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో దిగువన చూడండి….