
అర్థరాత్రి వేళ ఎటునుంచి వచ్చిందో ఏమో కానీ.. దాడి చేసి కుక్కను పట్టుకొని వెళ్లింది ఓ చిరుతపులి.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది.. పార్వతీనగర్ BC హాస్టల్ సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో కుక్కపై చిరుత దాడి ఒక్కసారిగా దాడి చేసింది. చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.. అక్కడున్న అరుగుపై కుక్క.. నిద్రిస్తుండగా.. చిరుత అక్కడకు వచ్చింది.. అనతరం.. రెప్పపాటులో కుక్కపై దాడి చేసిన చిరుత.. అనంతరం దానిని నోట పట్టుకుని.. అక్కడి నుంచి ఎత్తుకెళ్లింది. చిరుత సంచారంతో కళ్యాణ దుర్గం వాసులు భయాందోళనతో వణికిపోతున్నారు.
చిరుత సంచారం సమచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం సిబ్బందిని మోహరించి చిరుత జాడ కోసం వెతుకుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
కాగా.. చిరుత వీడియో వైరల్ అవ్వడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది.. దీంతో వన్యమృగాల నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..