AP Politics: ఆస్తులపై రచ్చ రచ్చ.. సవాళ్లు ప్రతి సవాళ్లతో తొడగొడుతున్న సింహపురి చిన్నోళ్లు..

|

Mar 27, 2023 | 8:17 AM

రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత!. నిన్ను కచ్చితంగా జైలుకు పంపించి తీరుతా!. అయితే నేను రెడీ, కానీ వైఎస్సార్‌ దగ్గర్నుంచి లెక్క తేలుద్దాం!. ఇదీ నెల్లూరు చౌరస్తాలో కాకరేపుతోన్న లేటెస్ట్‌ పొలిటికల్‌ ఫైట్‌.

AP Politics: ఆస్తులపై రచ్చ రచ్చ.. సవాళ్లు ప్రతి సవాళ్లతో తొడగొడుతున్న సింహపురి చిన్నోళ్లు..
Venkatagiri Politics
Follow us on

రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత!. నిన్ను కచ్చితంగా జైలుకు పంపించి తీరుతా!. అయితే నేను రెడీ, కానీ వైఎస్సార్‌ దగ్గర్నుంచి లెక్క తేలుద్దాం!. ఇదీ నెల్లూరు చౌరస్తాలో కాకరేపుతోన్న లేటెస్ట్‌ పొలిటికల్‌ ఫైట్‌. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి, ఇంకోవైపు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి. ఇద్దరూ కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. అయితే, టీవీ9 వీకెండ్‌ అవర్‌ డిబేట్‌ వేదికగా ఊహించని వ్యాఖ్యలు చేశారు ఆనం. పాత విషయాలను గుర్తుచేస్తూ వైసీపీ హైకమాండ్‌ను టార్గెట్‌చేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏంటా సెన్సేషనల్‌ కామెంట్స్‌?. ఆనం ఏమన్నారు?

తేల్చుకుందాం రా.. నీ పతాపమో నా పతాపమో!.. ఇది పరమ రొటీన్‌ డైలాగ్‌ అనుకున్నారో ఏమో!.. ఇప్పుడు ఆస్తులపై పడ్డారు. తేల్చుకుందాం రా!. రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంతో.. నా ఆస్తులెంతో అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు సింహపురి చిన్నోళ్లు. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి, మరోవైపు నేదురుపల్లి రామ్‌కుమార్‌రెడ్డి. వెంకటగిరి వేదికగా మాటలతో మంటలు పుట్టిస్తుండటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆనం వర్సెస్‌ నేదురుమల్లి ఫైట్‌లో మెయిన్‌గా ఆస్తులపై రచ్చ జరుగుతోంది. ఆనం అక్రమాల చిట్టా మొత్తం తీస్తాం, కచ్చితంగా కటకటాల వెనక్కి పంపి తీరుతామంటూ సవాల్‌ చేశారు. దీనికి టీవీ9 వీకెండ్‌ అవర్‌ డిబేట్‌లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ఆనం రామనారాయణరెడ్డి. వైఎస్సార్‌ హయాం నుంచి విచారణకు రెడీ అంటూ సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

పాత చరిత్ర మొత్తం తవ్వుకుంటూ ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు ఆనం అండ్‌ నేదురుమల్లి. మరి, వెంకటగిరి చౌరాస్తాలో చెలరేగిన ఈ పొలిటికల్‌ తుఫాన్‌ ఎక్కడ తీరం దాటుతుందో!. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..

మరిన్ని ఏపీ వార్తల కోసం..