Andhra Pradesh: వివాదాస్పదంగా మారిన డీఎస్పీ వ్యవహారం.. ఆ కేసులో పట్టుబడిన కారులో షికారు.. చివరకు..

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి DSP సునీల్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గంజాయి కేసులో పట్టుబడ్డ కారులో మహిళలతో షికారు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.

Andhra Pradesh: వివాదాస్పదంగా మారిన డీఎస్పీ వ్యవహారం.. ఆ కేసులో పట్టుబడిన కారులో షికారు.. చివరకు..
Anakapalli Dsp Sunil Kumar

Updated on: Feb 12, 2023 | 10:14 AM

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి DSP సునీల్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గంజాయి కేసులో పట్టుబడ్డ కారులో మహిళలతో షికారు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. నంబర్‌ ప్లేట్‌ మార్చి విశాఖ బీచ్‌ రోడ్డులో తిరుగుతూ ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో DSP వ్యవహారం వెలుగులోకొచ్చింది.

అయితే ప్రమాదానికి గురైన వాహన యజమానితో కేసు లేకుండా రాజీ కుదుర్చుకున్నారు. కానీ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు..DSP వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గంజాయి కేసులో సీజ్‌ చేసిన కారును వాడటంతో పాటు నంబర్‌ ప్లేట్‌ మార్చారన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు.

డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై..అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించామన్నారు ఎస్పీ గౌతమి శాలి. విచారణ నివేదికను పై అధికారులకు పంపామని..ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, DSP సునీల్‌ తీరు మొదట్నుంచీ వివాదాస్పదంగానే ఉంది. పలు సివిల్‌ వివాదాల్లో తల దూరుస్తున్నారంటూ పలుమార్లు చీవాట్లు పెట్టారు ఉన్నతాధికారులు. తాజాగా గంజాయి కేసులో పట్టుబడిన కారులో దొరికిపోవడంతో.. సీరియస్‌గా ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..