AP News: ఏముందన్నా ఆఫర్.! మందుబాబులకు సూపర్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

మందుబాబులకు బంపర్ ఆఫర్... తాగడానికి గ్లాస్...నంజుకోవడానికి గుడ్డు.... కలుపుకోవడానికి నీరు ఫ్రీ ....రాజంపేట పట్టణంలో మందు బాబులకు ఒక బార్ దివాళి బోనాంజ ఆఫర్ ప్రకటించింది.

AP News: ఏముందన్నా ఆఫర్.! మందుబాబులకు సూపర్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
Ap News
Follow us
Sudhir Chappidi

| Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2024 | 4:08 PM

మందుబాబులకు బంపర్ ఆఫర్… తాగడానికి గ్లాస్…నంజుకోవడానికి గుడ్డు…. కలుపుకోవడానికి నీరు ఫ్రీ ….రాజంపేట పట్టణంలో మందు బాబులకు ఒక బార్ దివాళి బోనాంజ ఆఫర్ ప్రకటించింది. మందు కొంటె గుడ్డు గ్లాసు వాటర్ ప్యాకెట్ ఉచితం అంటూ బ్యానర్లు వేసింది. దీంతో మందుబాబులంతా బార్ ముందు క్యూ కట్టారు…. ఇదెక్కడో తెలుసుకోవాలంటే అన్నమయ్య జిల్లా, రాజంపేటకు వెళ్లాల్సిందే.

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో మందు ప్రియులకు ఒక బారు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించింది. కేవలం మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు వేసింది. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేయడంతో చూసే వాళ్ళు అవాక్కయ్యారు.. ఏది ఏమైనప్పటికీ మందుబాబులకు దీపావళి పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. మందు బాటిల్ కొనడానికి మందు బాబులు క్యూ కట్టారు.

మద్యం ప్రియులను ఆకర్షించడానికి బ్రాందీ షాప్ యజమానులు పోటీలు పడుతూ ఇలా ఆఫర్లు ప్రకటించడంపై సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి కస్టమర్లను రాబట్టుకోవడానికి ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి అయితే దీపావళికి ఈ ఆఫర్ పెట్టడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మందు కొండం ఒకే అయితే మందు తాగడానికి సంబంధించిన సామాగ్రి దానికి సంబంధించిన టచింగ్ కొనుక్కోవడం అదో పెద్ద యజ్ఞమే గ్లాసు వాటర్ టచింగ్ ఈ మూడు ఉచితంగా ఇస్తామంటే ఎవరికి మాత్రం ఆనందం లేదు దానికోసం పెట్టే 40 రూపాయలు మిగిలినట్టే కదా అని హ్యాపీగా మిగతావన్నీ ఫ్రీగా తీసుకొని కిక్కెక్కించుకుంటున్నారు