పోలవరం అంచనాలు పెరగడం తన తండ్రి కష్టఫలితమని మాజీ మంత్రి నారా లోకేష్ డప్పుకొట్టుకోవడం ఆపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటించినప్పుడు.. పీఎం నరేంద్రమోదీని కలిసి పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి మాట్లాడారన్నారు. ప్రాజెక్టు సంబంధించి 55,548 కోట్ల సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పకుండా మొండికేసిన చరిత్ర మీదంటూ ట్వీట్ చేశారు.
పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు.దానికి స్పందనగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం ఆపాలి.ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 26, 2019