బీజేపీ ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. వైసీపీతో చెలిమి కొనసాగించాలనే ఉద్దేశంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. అయితే ఆ పదవి తమకు వద్దంటూ వైఎస్ జగన్ తిరస్కరించనట్లు తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం ప్రత్యేక హోదా అంశం అని తెలుస్తోంది.
జగన్ తొలి ప్రాధాన్యం ప్రత్యేక హోదా…
ఏపీ ప్రజల ఏకైక డిమాండ్ ప్రత్యేక హోదా.. దీనికోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరి ఎన్డీయేతో ఘర్షణ పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు జగన్. అందుకే బీజేపీ.. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినా.. దాని వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని భావించిన జగన్ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారట. ఒకవేళ ప్రతేక హోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే.. వైసీపీ నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉందవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.