ఆ లేఖపై విచారణ జరిపించండి.. డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ..!

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  లేఖ రాశారు.

ఆ లేఖపై విచారణ జరిపించండి.. డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ..!

Edited By:

Updated on: Apr 15, 2020 | 5:35 PM

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  లేఖ రాశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లను పొందపరచారని ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సమయంలో రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని.. విజయ సాయి రెడ్డి అన్నారు.

ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని.. ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, వర్ల రామయ్య, టీడీ జనార్థన్‌ల హస్తం ఉందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అంతేకాద ఈ తతంగమంతా రమేశ్‌ కుమార్‌కు తెలిసే జరిగిందని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై విచారించాలని డీజీపీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి గౌతమ్ సవాంగ్‌ని కోరారు.

Read This Story Also: ‘అరవింద సమేత’ తన సీన్లపై జగ్గుభాయ్‌ కీలక వ్యాఖ్యలు..!