‘అరవింద సమేత’లో తన సీన్లపై జగ్గుభాయ్ కీలక వ్యాఖ్యలు..!
లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కొంతమంది నటీనటులు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కొంతమంది నటీనటులు ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన సినిమాల గురించి, లాక్‌డౌన్ గురించి ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
”ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కంటే రియలైజేషన్ చాలా ముఖ్యం. అందుకే లాక్‌డౌన్ సమయంలో నేను నటించిన చిత్రాలను చూస్తూ.. అందులో నా తప్పులను అనలైజ్ చేస్తున్నా. దాని వలన రాబోయే రోజుల్లో మరింత బాగా నటించే అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం” అని జగపతి బాబు తెలిపారు. ఈ సందర్భంగా తాను విలన్‌గా నటించిన అరవింద సమేతలోని తన సీన్ల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”అరవింద సమేతలోని కొన్ని క్లోజప్ సన్నివేశాల్లో నేను సరిగా నటించలేదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు అంత ఈజీగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ నా హావభావాలు అంత బాలేవు. ఆ రోజు నా మూడ్ బాగోలేక నేను అలా నటించి ఉండొచ్చు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నా మూడ్‌ను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా. దాని వలన భవిష్యత్‌లో మంచిగా నటించే అవకాశం ఉంటుంది” అని ఆయన అన్నారు. కాగా ప్రస్తుతం ఈ నటుడు కీర్తి సురేష్ నటిస్తోన్న మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలతో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ఫలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: ఆ హిట్ మూవీ రీమేక్‌లో రవితేజ, రానా..!