రోజాకు మరో కీలక పదవి?

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ను ఎమ్మెల్యే రోజా ఎంతలా వినిపించిందో మనందరికీ తెలిసిందే. అయితే వివిధ సమీకరణాల వల్ల ఆమెకు సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. పార్టీకి ఆమె అందించిన సేవలు గుర్తుంచుకున్న జగన్..  రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.  ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు మరో కీలకమైన పదవీ బాధ్యతలు అప్పగించాలనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన ఆ పార్టీ నవరత్నాల […]

రోజాకు మరో కీలక పదవి?

Updated on: Jun 19, 2019 | 2:15 PM

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ను ఎమ్మెల్యే రోజా ఎంతలా వినిపించిందో మనందరికీ తెలిసిందే. అయితే వివిధ సమీకరణాల వల్ల ఆమెకు సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. పార్టీకి ఆమె అందించిన సేవలు గుర్తుంచుకున్న జగన్..  రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.  ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు మరో కీలకమైన పదవీ బాధ్యతలు అప్పగించాలనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం.

వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన ఆ పార్టీ నవరత్నాల హామీలను నెరవేర్చేందుకు జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రమాణ స్వీకార సభలో కూడా మేనిఫెస్టోను దైవంలా భావిస్తానని..అదే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు. ఈ క్రమంలోనే రోజాకు నవరత్నాల అమలుకు సంబంధించి కీలక బాధ్యతలు కట్టబెడతారని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన నవరత్నాల అమలుకు మంత్రి వర్గంలో అవకాశం దక్కని నేతలకు ఆ ఛాన్స్ అభించేలా చూస్తానని జగన్‌ చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ వేసి దానికి చైర్ పర్సన్ రోజాను నియమిస్తారని… ఇందులోనే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కూడా స్థానం ఉంటుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.