వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దైంది. లండన్‌లో చదువుకుంటోన్న కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా జగన్ నేడు లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఫొని తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఫొని బీభత్సం నేపథ్యంలో ప్రజలను గాలికొదిలేసిన జగన్.. సినిమాలు చూస్తూ, పర్యటనల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.