పర్సనాలిటీలు పెరిగితే కాదు… బుద్ది పెరగాలి – జగన్

అమరావతి: వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సున్నా వడ్డీపై ఇరు పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది ఇలా ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సున్నా వడ్డీపై ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. అసెంబ్లీలో మీ బలం ఎంత.. మా […]

పర్సనాలిటీలు పెరిగితే కాదు... బుద్ది పెరగాలి - జగన్

Updated on: Jul 12, 2019 | 10:57 AM

అమరావతి: వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సున్నా వడ్డీపై ఇరు పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది ఇలా ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సున్నా వడ్డీపై ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. అసెంబ్లీలో మీ బలం ఎంత.. మా బలం ఎంతా’ అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము 150 మంది ఉన్నామన్న ఆయన.. తలుచుకుంటే సభలో ఒక్కరూ మాట్లాడలేరని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ప్రతిపక్షం బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని.. ‘పర్సనాలిటీ పెరిగితే సరిపోదు.. బుద్ది పెరగాలి’ అని జగన్ మండిపడ్డారు. కాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

మరోవైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం 12.22 నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రూ. 2.31లక్షల కోట్ల బడ్జెట్ వ్యయం. ఇక ఈ బడ్జెట్ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ.. రూ.28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.