గత టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోన్న జగన్ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు నిర్మాణం కోసం 2010లో నాటి ప్రభుత్వం నవయుగ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వైసీపీ గవర్నమెంట్ రద్దు చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతోనే పోర్టును నిర్మించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో కన్సార్టియం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీంతో డెవలపర్‌కు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ ద్వారా బందరు పోర్టు నిర్మాణం, అభివృద్ధి చేపట్టాలని జగన్ సర్కారు భావిస్తోంది.