AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలీ ‘బాబు’.. 23 దొంగలు: టీడీపీపై అనిల్ కుమార్ వ్యంగాస్త్రాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడావేడీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏమీ తెలియని మంత్రి అనిల్.. చంద్రబాబుకు పాఠాలు చెబుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అనిల్.. ‘‘మాకు తెలియకున్నా నేర్చుకుంటాం. ఎన్నికల్లో గెలవని లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చిన […]

అలీ ‘బాబు’.. 23 దొంగలు: టీడీపీపై అనిల్ కుమార్ వ్యంగాస్త్రాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 12:47 PM

Share

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడావేడీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏమీ తెలియని మంత్రి అనిల్.. చంద్రబాబుకు పాఠాలు చెబుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అనిల్.. ‘‘మాకు తెలియకున్నా నేర్చుకుంటాం. ఎన్నికల్లో గెలవని లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చిన ఘనత టీడీపీది. మంగళగిరి పేరును కూడా పలకలేని వ్యక్తిని మంత్రిని చేశారు. ధర్మపోరాటం, పోలవరంలో అవినీతికి పాల్పడ్డారు. అందుకే అలీ బాబు.. 23 దొంగలుగా టీడీపీ కనిపిస్తోంది’’ అంటూ ఘాటు కామెంట్లు చేశారు.