AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravathi: అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్.. ఐకానిన్ బ్రిడ్జిలు, వంతెనలు..

అమరావతి ఓఆర్‌ఆర్‌పై మరో అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఇందకముందు చేసిన ప్రతిపాదనను మళ్లీ మార్చుకున్నారు. సీఎం చంద్రబాబు సూచనతో ప్రాజెక్టులో మార్పులు చేశారు. కొత్త ప్లాన్ ఎలా ఉందంటే..

Amaravathi: అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్.. ఐకానిన్ బ్రిడ్జిలు, వంతెనలు..
Orr
Venkatrao Lella
|

Updated on: Oct 13, 2026 | 2:19 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ప్రాజెక్ట్‌పై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై కేబుల్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు సాధారణ బ్రిడ్జిలు మాత్రమే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నా.. సీఎం చంద్రబాబు సూచనలతో ప్లాన్‌లో మార్పులు చేశారు. కొత్త ప్లాన్‌లో భాగంగా కృష్ణానదిపై మూడు లైన్లతో రెండుచోట్ల బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఐకానిక్ బ్రిడ్జిలు ఉండాలని చంద్రబాబు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ప్లాన్‌లో ఎన్‌హెచ్ఏఐ మార్పులకు శ్రీకారం చుట్టింది.

2018లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ సమయంలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెనల నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ 2024లో డిసెంబర్‌లో గతంలోని ప్రతిపాదనను పక్కన పెట్టి సాధారణ బ్రిడ్జిలు మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. రూ.38,450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్ కూడా రూపొందించగా.. ఇప్పుడు మళ్లీ మార్పులు చేశారు. చంద్రబాబు కోరిన విధంగా ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.30,491 కోట్లు తగ్గించారు. ఓఆర్ఆర్ బయటవైపు సర్వీస్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదనను పక్కన పెట్టారు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేలో కాజ వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 లైన్ల కనెక్ట్ రోడ్డు ప్రతిపాదన తొలగించారు. అలాగే మూడుచోట్ల సొరంగాలను 8 వరుసల రోడ్డుకు అనుకూలంగా తవ్వాలని ప్రతిపాదించగా.. దీనిని ఆరు వరుసల సొరంగాలకు పరిమితం చేశారు.

Follow Us
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్