గుండె తరుక్కుపోతోంది.. విశాఖ ఘటనపై సినీ, క్రీడా ప్రముఖుల ట్వీట్లు..!

| Edited By:

May 07, 2020 | 2:45 PM

గ్యాస్ లీకేజీతో వైజాగ్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఆదమరిచి నిద్రపోతున్న వారిపై విషపూరిత స్టెరీన్ గ్యాస్ పంజా విసిరింది. దీంతో పది మంది ప్రాణాలను కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 11 జిల్లాలకు ఈ గ్యాస్‌ విస్తరించగా.. వేలాది మూగ జీవాలు సైతం మృత్యువాతపడ్డాయి. కాగా ఈ ఘోర ప్రమాదంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. గుండె తరుక్కుపోతోందని.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వారు వెల్లడించారు. అసలే కరోనాతో ఎక్కడికీ కదలలేని పరిస్థితి […]

గుండె తరుక్కుపోతోంది.. విశాఖ ఘటనపై సినీ, క్రీడా ప్రముఖుల ట్వీట్లు..!
Follow us on

గ్యాస్ లీకేజీతో వైజాగ్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఆదమరిచి నిద్రపోతున్న వారిపై విషపూరిత స్టెరీన్ గ్యాస్ పంజా విసిరింది. దీంతో పది మంది ప్రాణాలను కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 11 జిల్లాలకు ఈ గ్యాస్‌ విస్తరించగా.. వేలాది మూగ జీవాలు సైతం మృత్యువాతపడ్డాయి. కాగా ఈ ఘోర ప్రమాదంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. గుండె తరుక్కుపోతోందని.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వారు వెల్లడించారు. అసలే కరోనాతో ఎక్కడికీ కదలలేని పరిస్థితి ఉంటే ఈ ఘటన మరింత బాధించిందంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: వైజాగ్ గ్యాస్ ప్రమాదం.. ‘ఎల్జీ పాలిమర్స్’‌ చరిత్ర ఇదే..!