మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు

మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమిరెడ్డితో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. వివరాల్లోకి వెళ్తే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా […]

మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు
Somireddy Sensational Comments On Kodela Death

Edited By:

Updated on: Aug 28, 2019 | 4:31 PM

మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమిరెడ్డితో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు.

వివరాల్లోకి వెళ్తే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. దీంతో విషయం అప్పట్లో సోమిరెడ్డి దృష్టికి వెళ్లగా 2.40ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి.. మరొకరికి అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ భూమిని సోమిరెడ్డి అక్రమంగా అమ్ముకున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.

మరోవైపు ఈ వివాదంపై సోమిరెడ్డి స్పందించారు. తనపై తప్పుడు కేసులు పెడతారని ముందుగానే ఊహించానని.. ప్రభుత్వం మారగానే తనను లక్ష్యంగా చేసుకుంటారని కూడా తెలుసని ఆయన అన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసును కప్పిపుచ్చి ప్రైవేటు కేసు పెట్టారని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడనని.. న్యాయస్థానంలో పోరాడతానని సోమిరెడ్డి అన్నారు.