“అమ్మా” సుచరితా.. ఎంత మంచి పనిచేశావమ్మా..

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సేవాగుణాన్ని చాటుకున్నారు. లారీలో వెళుతున్న నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో పక్కనే ఉన్న డ్రైవర్ భయంతో అతడిని రోడ్డుపై వదిలేసి వెళిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న హోంమంత్రి సుచరిత రోడ్డు పక్కనే కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసి.. వెంటనే తన కారును ఆపి సిబ్బంది చేత ప్రాథమిక చికిత్స చేయించారు. బాధితుడి ఫోన్ నుంచి వారి బంధువులకు సమాచారం […]

అమ్మా సుచరితా.. ఎంత మంచి పనిచేశావమ్మా..
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 3:45 PM

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సేవాగుణాన్ని చాటుకున్నారు. లారీలో వెళుతున్న నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో పక్కనే ఉన్న డ్రైవర్ భయంతో అతడిని రోడ్డుపై వదిలేసి వెళిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న హోంమంత్రి సుచరిత రోడ్డు పక్కనే కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసి.. వెంటనే తన కారును ఆపి సిబ్బంది చేత ప్రాథమిక చికిత్స చేయించారు. బాధితుడి ఫోన్ నుంచి వారి బంధువులకు సమాచారం అందించారు. ఆ తరువాత బాధితుడు నెల్లూరు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసుల ద్వారా గుంటూరు బస్టాండ్‌కు తరలించారు.