Andhra Pradesh: ఏపీ రైతన్నలకు గుడ్‎‎న్యూస్.. ఆ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..

| Edited By: Janardhan Veluru

Nov 16, 2021 | 12:19 PM

ఆంధ్రప్రదేశ్‎లో‎ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు జగన్ ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఈ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఇదే సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు...

Andhra Pradesh: ఏపీ రైతన్నలకు గుడ్‎‎న్యూస్.. ఆ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
Ap
Follow us on

ఆంధ్రప్రదేశ్‎లో‎ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు జగన్ ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఈ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఇదే సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ సైక్లోన్‌ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారం సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి వాస్తవ సాగుదార్లకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు. గత రెండు వారాలుగా పడుతున్న వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. కడప, అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకుని, వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80 శాతం రాయితీతో మళ్లీ విత్తుకోవడానికి విత్తనాలను సరఫరా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది అన్నదాతలకు రూ.1,071 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం అందించారు.

Read Also.. Crime News: పెళ్లైన పదహారు రోజులకే నవ వధువు అనుమానాస్పద మృతి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి సంచలనాలు!

Karivena Satram: కాశీ తెలుగు యాత్రికులకు గుడ్‌న్యూస్.. వారణాసిలో అందుబాటులోకి వచ్చిన అధునాతన భవనం!