చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Edited By:

Updated on: Jun 06, 2020 | 9:28 PM

టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమేంటో ఇప్పటికీ బాబు తెలుసుకోలేకపోతున్నారని మద్దాలి వ్యాఖ్యానించారు.

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనపై మాట్లాడిన గిరిధర్ రావు.. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అందరూ మెచ్చుకునేలా జగన్ పరిపాలన చేస్తున్నారని కితాబిచ్చారు. అవినీతిని అరికట్టే విధంగా జగన్ పాలన ఉందని ప్రశంసించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా మద్దాలి సూటిగా ప్రశ్నించారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబేనని.. తన హయాంలోని అవినీతిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని మద్దాలి డిమాండ్ చేశారు. కాగా వైసీపీలో చేరేందుకు మద్దాలి సిద్దంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: Big Breaking: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా