జనసేనాని నిర్ణయంతో.. ఆనందంలో టీడీపీ..

| Edited By:

Aug 31, 2019 | 2:26 PM

ఏపీలో రాజకీయ నేతలంతా రాజధాని అమరావతి గురించే చర్చించుకుంటున్నారు. రాజధాని విషయంలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ, అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం స్పష్టం ఇవ్వకపోవడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. రాజధాని నిర్మాణాన్ని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని ఎక్కువగా ప్రచారం సాగుతోంది. అమరావతి విషయాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ వాదనకు వంత పాడినట్లుగా బీజేపీ వ్యవహరించింది. […]

జనసేనాని నిర్ణయంతో.. ఆనందంలో టీడీపీ..
Follow us on

ఏపీలో రాజకీయ నేతలంతా రాజధాని అమరావతి గురించే చర్చించుకుంటున్నారు. రాజధాని విషయంలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ, అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం స్పష్టం ఇవ్వకపోవడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. రాజధాని నిర్మాణాన్ని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని ఎక్కువగా ప్రచారం సాగుతోంది. అమరావతి విషయాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ వాదనకు వంత పాడినట్లుగా బీజేపీ వ్యవహరించింది. కాని, రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని చివరి నిమిషంలో బాంబు పేల్చింది. దీంతో ప్రతిపక్షాల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేవారు వెనక్కు తగ్గారు.

తాజాగా రాజధాని అమరావతి విషయంలో జనసేనాని తీసుకున్న నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజధానిని అమరావతి నుంచి మార్చకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో… ఆయన ఈ అంశంపై టీడీపీ చేసే ఆందోళనలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తమకు మళ్లీ దగ్గరైతే… వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు మరింత బలం చేకూరుతుందని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమరావతి విషయంలో టీడీపీకి సపోర్టు చేస్తున్న పవన్.. రాబోయే రోజుల్లో ఆ పార్టీతో కలుస్తారా.. లేదా అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..