ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం నుంచి  తెదేపా అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయన ఎన్నికలకు ముందుగానే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. 2016లో గవర్నర్‌ కోటాలో సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం 2022 వరకు ఉంది.

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా

Edited By:

Updated on: Mar 07, 2019 | 8:15 PM