చిరు వ్యాపారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. మొదలైన సర్వే

| Edited By:

Jul 06, 2020 | 11:26 AM

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల నిర్వహణకే పెద్ద పీట వేస్తూ వస్తోన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

చిరు వ్యాపారులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. మొదలైన సర్వే
Follow us on

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల నిర్వహణకే పెద్ద పీట వేస్తూ వస్తోన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఏపీలోని చిరు/వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జగనన్న తోడు అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అక్టోబర్‌లో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నారు. ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించనుంది. ఈ క్రమంలో అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు సర్వే నిర్వహించనున్నారు.  16వ తేదీ నుంచి 23 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. వీరికి అక్టోబర్‌లో ప్రభుత్వం  పది వేల సాయాన్ని అందించనుంది.