మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లుగా కండక్టర్లు.. ఆలోచనలో అధికారులు..!

ఏపీలో మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లుగా ఆర్టీసీ కండక్టర్లను నియమించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లుగా కండక్టర్లు.. ఆలోచనలో అధికారులు..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 10:37 AM

ఏపీలో మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లుగా ఆర్టీసీ కండక్టర్లను నియమించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్ నియమించిన సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మద్యం నిల్వల్లో తేడాలు వస్తుండటం, అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు సక్రమంగా బ్యాంకుల్లో జమచేయకపోవడం వంటి అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కండక్టర్లను సూపర్‌వైజర్లుగా నియమిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే చోట కండక్టర్లను సూపర్‌వైజర్లుగా నియమించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో అదనంగా ఉన్న కండక్టర్‌లను డిప్యుటేషన్‌పై సూపర్‌వైజర్లుగా పంపి వారికి బెవరేజేస్‌ కార్పొరేషన్‌నే జీతం చెల్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉందని, దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం పట్టణాల్లోని ఒక్కో దుకాణంలో ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు సేల్స్‌మన్‌.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సేల్స్‌మన్‌ పనిచేస్తున్నారు.

Read This Story Also: #SSMB27: మహేష్ ‘సర్కారు వారి పాట’.. లుక్ అదిరిపోయిందిగా..!