Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

#SSMB27: మహేష్ ‘సర్కారు వారి పాట’.. లుక్ అదిరిపోయిందిగా..!

తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ని ఇచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తదుపరి చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు లుక్‌ని కూడా విడుదల చేశారు.
Mahesh Babu Sarkaru Vaari Paata, #SSMB27: మహేష్ ‘సర్కారు వారి పాట’.. లుక్ అదిరిపోయిందిగా..!

తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ని ఇచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తదుపరి చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు లుక్‌ని కూడా విడుదల చేశారు. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నెక్ట్స్‌ సినిమాలో నటించబోతుండగా.. ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇక లుక్‌లో కూడా సూపర్‌స్టార్ అదరగొట్టేశారు. ఒక చెవికి రింగు, మెడపైన రూపాయి బిళ్ల టాటూతో మహేష్ కేక పెట్టిస్తున్నారు. లుక్‌ని చూసిన ఫ్యాన్స్ సూపర్, మరో బ్లాక్‌బస్టర్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో SSMB27, సర్కారు వారి పాట(SarkaruVaariPaata) హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం.

Read This Story Also: రానా Weds మిహీకా.. డేట్ ఫిక్స్‌..!

Related Tags