ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనపై ఆ దేశ రాయబారి రోన్ మాల్కా ట్విటర్‌లో స్పందించారు. నీటి లవణీకరణపై ఏపీతో ఒప్పందం విజయవంతమైందని వెల్లడించారు. తమ సాంకేతికత ఏపీకి బాగా చక్కగా ఉపయోగపడుతుందని ట్విటర్లో పోస్టు చేశారు.
ఇజ్రాయిల్‌లో పర్యటించిన సీఎం జగన్ హడేరాలో.. H2ID ఉప్పునీటిని శుద్ది చేసే ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం, ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్సియల్ వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అయిన ఖర్చు, కార్యాచరణ తదితరాల గురించి వివరించారు. అక్కడ శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. దాని నాణ్యతను తెలుసుకుని ప్రశంసించారు. జగన్‌తో పాటు టెల్ అవీవ్‌లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ కూడా ఉన్నారు. హడేరా ప్లాంట్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.
Happy to hear about the successful visit of @AndhraPradeshCM @ysjagan at the water desalination plant in Hadera during his maiden trip to #Israel.#Water is an important part of our partnership with #AndhraPradesh & we’re happy to share Israeli technologies with our dear friends pic.twitter.com/euXcFhwx1i
— Ron Malka ?? (@DrRonMalka) August 5, 2019