నేడు అమరావతికి జనసేనాని..నేతలతో విడివిడిగా భేటి

జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పవన్ గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి చేరుకోనున్నారు. మొన్న జరిగిన సమీక్షా సమావేశాలకి కొనసాగింపుగా మరోసారి నాయకులతో విడివిడిగా ఆయన భేటీ కానున్నారు. పార్టీలో నుంచి వెళ్తున్న నేతల గురించి ప్రత్యేకంగా కోర్ కమిటీతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా నాయకులతో పవన్ చర్చించే అవకాశం ఉంది. కాగా కొందరు నేతలు పార్టీపై, అధినేతపై బహిరంగ విమర్శలు చేస్తోన్న […]

నేడు అమరావతికి జనసేనాని..నేతలతో విడివిడిగా భేటి

Updated on: Jun 22, 2019 | 11:29 AM

జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి పవన్ గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి చేరుకోనున్నారు. మొన్న జరిగిన సమీక్షా సమావేశాలకి కొనసాగింపుగా మరోసారి నాయకులతో విడివిడిగా ఆయన భేటీ కానున్నారు. పార్టీలో నుంచి వెళ్తున్న నేతల గురించి ప్రత్యేకంగా కోర్ కమిటీతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా నాయకులతో పవన్ చర్చించే అవకాశం ఉంది. కాగా కొందరు నేతలు పార్టీపై, అధినేతపై బహిరంగ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో..వాటిపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.