అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచలేరు: పవన్ ఫైర్

పాదయాత్ర చేసేందుకు అనుమతి లేదంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత చంద్రబాబును వాహనంలో తీసుకెళ్లి నేరుగా ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. అయితే బాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు […]

అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచలేరు: పవన్ ఫైర్

Edited By:

Updated on: Jan 09, 2020 | 8:05 AM

పాదయాత్ర చేసేందుకు అనుమతి లేదంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత చంద్రబాబును వాహనంలో తీసుకెళ్లి నేరుగా ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. అయితే బాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. కానీ అరెస్ట్‌లతో ఉద్యమం ఆగదంటూ ధ్వజమెత్తారు.

ఇక అమరావతి మహిళలు, వృద్ధులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కూడా పవన్ తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే తక్షణమే రాజధాని గందరగోళానికి ప్రభుత్వం తెరదించాలని ఆయన సూచించారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అది మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించాలని పవన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని జగన్ సర్కార్ యోచిస్తోందా..? అంటూ పవన్ ప్రశ్నించారు.