వైసీపీ కార్యకర్తలే మద్యం వాలంటీర్లా..? పండుగ చేసుకోండి: లోకేష్

| Edited By:

Jul 25, 2019 | 4:18 PM

మద్యనిషేధం విషయంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ల పై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ సెటైరికల్‌గా స్పందించారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి. మద్య అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారని లోకేష్ ట్వీట్ చేశారు. అసలు ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు అని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేశారు. […]

వైసీపీ కార్యకర్తలే మద్యం వాలంటీర్లా..? పండుగ చేసుకోండి: లోకేష్
Follow us on

మద్యనిషేధం విషయంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ల పై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ సెటైరికల్‌గా స్పందించారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి. మద్య అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారని లోకేష్ ట్వీట్ చేశారు. అసలు ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు అని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేశారు. ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి అంటూ తనదైన శైలిలో సెటైర్ వేశారు.