ఏపీ రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఓ వైపు ఏపీ రాజధానుల అంశంతో రాజకీయాలు వేడెక్కుతుంటే.. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ట్వీట్స్ యుద్ధం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో విమర్శలతో పాటు.. ఫేక్ న్యూస్ కూడా విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. తాజాగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకం గురించి తెలిసిందే.
అయితే ఈ క్రమంలో ఏపీలోనే అమలవుతున్న ఈ అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ సోషల్ మీడయాలో ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు కొందరు ఆకతాయిలు. అంతేకాదు.. దీనికి సంబంధించిన కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఇక నారా లోకేష్.. తన అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఓ ట్వీట్ కూడా ఎడిట్ చేశారు. తమకు రూ. 15 వేలు అకౌంట్‌లో వేసినందుకు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు పోస్ట్ చేశారు. అయితే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న నారా లోకేష్.. ఈ ఫేక్ పోస్ట్‌లపై స్పందించారు.
అమ్మ ఒడి పథకం కింద తన సతీమణి నారా బ్రాహ్మణి అకౌంట్‌లో రూ.15000 జమ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉన్న పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేశారు. ఇదంతా వైసీపీ శ్రేణులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు. “మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు… జగన్ ముందు వేసుకోండి. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది” అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి వేస్తుంది. అమ్మ ఒడి అని బొమ్మ చూపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారు. అర్హుల సంఖ్య సగానికి కోసారు.(1/2) pic.twitter.com/fBphqVIY8J
— Lokesh Nara (@naralokesh) January 9, 2020
మీ పిచ్చి డ్రామాలు @ysjagan గారి ముందు వేసుకోండి, నా దగ్గర కాదు. వైకాపా పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది. మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ గారి దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతా. రేపు శుక్రవారం.. మీ డప్పు అక్కడ కొట్టుకోండి.(2/2)
— Lokesh Nara (@naralokesh) January 9, 2020