అమరావతి: గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్. ఈ సారి ఏపీ మంత్రి పేర్ని నాని వ్కక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. పేర్ని నాని వేధింపులతో జయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.
సంబంధిత లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. సాక్షాత్తూ మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ కార్యకర్తలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్న సమయంలోనే మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ ఇదేనా రాజన్న రాజ్యం..జగన్ గారూ’’ అని ట్టిటర్‌లో ప్రశ్నించారు.
వైకాపా మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మిగారు ఆత్మహత్యాయత్నం చేసారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ? ఇదేనా రాజన్న రాజ్యం @ysjagan గారు ? pic.twitter.com/hSdW7tXHjg
— Lokesh Nara (@naralokesh) July 14, 2019