ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: రోజా భావోద్వేగం

మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి స్నేహితుడైన శివప్రసాద్ కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని ఆమె అన్నారు. తనను సినిమాలకు, రాజకీయాలకు పరిచయం చేసింది ఆయనేనని రోజా గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు రాజకీయాల్లో, సినీ రంగంలో, కుటుంబపరంగా కనిపిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కాగా తాను దర్శకత్వం వహించిన ‘ప్రేమ తపస్సు’ […]

ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: రోజా భావోద్వేగం

Edited By:

Updated on: Sep 22, 2019 | 11:32 AM

మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి స్నేహితుడైన శివప్రసాద్ కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని ఆమె అన్నారు. తనను సినిమాలకు, రాజకీయాలకు పరిచయం చేసింది ఆయనేనని రోజా గుర్తుచేసుకున్నారు. ఆయన లేని లోటు రాజకీయాల్లో, సినీ రంగంలో, కుటుంబపరంగా కనిపిస్తోందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

కాగా తాను దర్శకత్వం వహించిన ‘ప్రేమ తపస్సు’ సినిమా ద్వారా రోజాను సినిమాల్లోకి తీసుకొచ్చారు శివ ప్రసాద్. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. అంతకుముందు ఆమె పేరు శ్రీలత అని ఉండగా.. రోజా అని మార్చింది కూడా ఆయనే కావడం విశేషం. ఇక ఆ తరువాత రాజకీయాల్లోకి కూడా రోజాను ఆయనే తీసుకొచ్చారు. ఈ క్రమంలో మొదట టీడీపీలో ఉన్న రోజా.. వైఎస్సార్ మరణం తరువాత వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.