మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. ఈ వ్యవహారాన్ని ఏబీ వెంకటేశ్వరరావే నడిపించారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని మల్లాది పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో ఏబీవీ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా పనిచేశారని మల్లాది విమర్శలు గుప్పించారు. టీవీ9లో బిగ్‌న్యూస్- బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.