ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు సుబ్రహ్మణ్యం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ నూతన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.