గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి కట్టడం..120ఏళ్లు పూర్తి

|

Sep 01, 2020 | 1:38 PM

చరిత్ర ప్రవాహంలో శతాబ్ధపు సేవలకు జ్ఞాపకంగా నిలిచింది.. అఖండ గోదావరిపై అందంగా హోయలు పోతూ..ఆ దరిని ఈ దరిని కలిపిన వారధి. శతాబ్ద కాల అనుబంధం ఉన్న ఈ వారధి కేవలం ఇటుక, కాంక్రీటు కలబోత మాత్రమే కాదు..

గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి కట్టడం..120ఏళ్లు పూర్తి
Follow us on

చరిత్ర ప్రవాహంలో శతాబ్ధపు సేవలకు జ్ఞాపకంగా నిలిచింది.. అఖండ గోదావరిపై అందంగా హోయలు పోతూ..ఆ దరిని ఈ దరిని కలిపిన వారధి. దేశంలో దక్షిణాది ప్రాంతాన్ని తూర్పుతో అనుసంధానం చేస్తూ..అనుబంధాన్ని కలిపిన బంధం. శతాబ్ద కాల అనుబంధం ఉన్న ఈ వారధి కేవలం ఇటుక, కాంక్రీటు కలబోత మాత్రమే కాదు.. గోదావరి నడుమ ఒయ్యారంగా అబ్బురపరిచే అందంతో జన ప్రయాణానికి సహకరించి చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సాధించింది. ప్రస్తుతానికి విహార తోరణంగా, ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనంగా పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై నిర్మించిన తొలి అద్భుత కట్టడం హేవలాక్‌ వంతెన.. గోదావరిపై తొలి రైలు వంతెనను సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పర్యవేక్షణలో 1897 నవంబర్ 11న ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైనది. దీనిని ఎఫ్‌.టి.జి. వాల్టన్‌ అనే ఇంజినీరు పర్యవేక్షించారు. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ. 50,40,457గా అంచనా వేయగా,.. అయిన ఖర్చు మాత్రం రూ. 46,89,849తో 1900 సంవత్సరంలో పూర్తిచేశారు. అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ అర్ధర్ ఎలిబoక్ హేవలాక్ పేరు మీద ఈ వంతెన హవేలాక్ వంతెన గా పిలవబడింది. ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశం గా మార్చబడినది.

56 స్తంభాలతో 2.95 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన వందేళ్లు పూర్తిచేసుకోవడంతో 1997లో ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఈ అద్భుత కట్టడం సందర్శకులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. జీవిత కాలం సేవలందించి 120 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ వంతెన నేటికీ చెక్కుచెదరలేదు.