స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపొద్దని ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఎవరైనా పోటీలో నిలిపితే ఆ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకున్నవారికి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.
కాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గానూ నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుంది. గురువారం నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈనెల 14న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఫలితాలను మార్చి 24న ప్రకటించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 13 వరకు గడువు ఉంది. ఈ ఎన్నికలకు గానూ మార్చి 23న ఎన్నికల పోలింగ్ .. 27న ఫలితాలను ప్రకటన వెలువడనుంది.
Read This Story Also: Big Breaking: సీబీఐకి వివేకా హత్య కేసు.. హైకోర్టు తీర్పు!