Big Breaking: సీబీఐకి వివేకా హత్య కేసు.. హైకోర్టు తీర్పు!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి

Big Breaking: సీబీఐకి వివేకా హత్య కేసు.. హైకోర్టు తీర్పు!
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2020 | 3:12 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్‌లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. పులివెందుల పీఎస్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది.

కాగా గతేడాది మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. మొదట ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించారని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత పోస్ట్‌మార్టంలో హత్యగా తేలింది. మరో నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉండగా.. జరిగిన ఈ హత్య అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. వివేకా హత్యపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఓ సిట్ బృందాన్ని దర్యాప్తు కోసం ఏర్పాటు చేసింది. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్.. మరో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం దాదాపు 1400మందిని ఈ కేసులో విచారించింది. అందులో భాగంగా వైఎస్ కుటుంబసభ్యులతో పాటు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిని సిట్ బృందం విచారించింది. కానీ దాదాపు సంవత్సరం కావొస్తున్నా ఈ కేసులో నిందితులెవరో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ అప్పట్లో పిటిషన్ వేసిన జగన్.. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ హత్య రాజకీయాల్లో కలకలం సృష్టించగా.. ఇప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.