ఏపీలో వారానికే భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు..!

| Edited By:

May 10, 2020 | 10:10 PM

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ నెల 4నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కరోనాను కూడా పట్టించుకోకుండా తొలి రోజుల్లో మద్యం షాపులన్నీ కిక్కిరిసిపోయాయి.

ఏపీలో వారానికే భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు..!
Follow us on

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ నెల 4నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కరోనాను కూడా పట్టించుకోకుండా తొలి రోజుల్లో మద్యం షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. సామాజిక దూరం, మాస్క్‌లు పెట్టుకోవడం వంటి కనీస జాగ్రత్తలను పట్టించుకోని మందుబాబులు దుకాణాల వద్ద గుమిగూడారు. రేట్లను పెంచినప్పటికీ.. ఎగబడి మరీ మద్యాన్ని కొన్నారు. అయితే శనివారం వరకు ఈ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా ఉండగా.. ఆదివారం మాత్రం తగ్గిపోయాయి. మద్యం ధరలను 75శాతం పెంచడంతో పాటు.. దుకాణాల సంఖ్యను 13శాతం తగ్గించడంతో లిక్కర్ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా మే 4న మద్యం విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి దాదాపుగా రూ.70కోట్లు వచ్చాయి. ఇక మే 9న రూ.40.77 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు వెల్లడించారు.

Read This Story Also: Breaking: మే 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభం.. రేపటి నుంచే బుకింగ్..!