56 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నా: ఏపీ మంత్రి

ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు 56 ఏళ్ల వయసులో తాను ఆ భాషను నేర్చుకుంటున్నానని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు.

56 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నా: ఏపీ మంత్రి

Edited By:

Updated on: May 28, 2020 | 10:44 AM

ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు 56 ఏళ్ల వయసులో తాను ఆ భాషను నేర్చుకుంటున్నానని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన మేధోమథన సదస్సులో మాట్లాడిన మోపిదేవి.. సీఎం జగన్ విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఏడాది కాలంలోనే రాజన్న బడిబాట, అమ్మఒడి, జగనన్న గోరుముద్దులు, మనబడి నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, జగనన్న విద్యాదీవెన తదితర కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఇంగ్లీష్‌ నేర్చుకోవడం చాలా అవసరం అని.. దాని మీద పట్టు సాధించేందుకే తాను ఈ వయస్సులో ఆ భాషను నేర్చుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంపుదల, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసి సీఎం జగన్ విద్యారంగంలో ముందడుగు వేశారని అన్నారు.

Read This Story Also: బన్నీని తప్ప ఎవరినీ చూడలేదు.. ‘అల’ రీమేక్‌లో నటించేందుకు రెడీ: బాలీవుడ్ హీరో