పొరపాటున తాజ్ ఏపీలో ఉండి ఉంటే.. కేశినేని సెటైర్లు

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా దీనిని నిర్మించారని తేల్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రజావేదికను కూల్చివేసింది. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రజావేదిక కూల్చివేతపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని.. తన సోషల్ మీడియాలో సెటైర్లు విసిరారు. ‘‘ఇంకా నయం.. తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి […]

పొరపాటున తాజ్ ఏపీలో ఉండి ఉంటే.. కేశినేని సెటైర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2019 | 2:29 PM

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా దీనిని నిర్మించారని తేల్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రజావేదికను కూల్చివేసింది. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రజావేదిక కూల్చివేతపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని.. తన సోషల్ మీడియాలో సెటైర్లు విసిరారు.

‘‘ఇంకా నయం.. తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే.. ’’అంటూ ఆయన కామెంట్లు చేశారు. కాగా అక్రమ కట్టడాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలున్నా.. వాటికి నోటీసులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/posts/1233211380193059