టీడీపీ వేధింపులకు గురిచేసింది.. నన్ను చంపేందుకు కుట్ర చేశారు

| Edited By: Anil kumar poka

Apr 17, 2019 | 3:56 PM

సామాజిక న్యాయం కోసమే తాను టీడీపీలో చేరానని.. కానీ ఆ పార్టీ తనను వేధింపులకు గురిచేసిందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన హర్ష కుమార్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన కారు టైర్ల బోల్టులు ఊడదీసి తనను చంపే ప్రయత్నం చేశారని హర్ష కుమార్ అన్నారు. ఈ విషయంపై అప్పుడే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని […]

టీడీపీ వేధింపులకు గురిచేసింది.. నన్ను చంపేందుకు కుట్ర చేశారు
Follow us on

సామాజిక న్యాయం కోసమే తాను టీడీపీలో చేరానని.. కానీ ఆ పార్టీ తనను వేధింపులకు గురిచేసిందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన హర్ష కుమార్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన కారు టైర్ల బోల్టులు ఊడదీసి తనను చంపే ప్రయత్నం చేశారని హర్ష కుమార్ అన్నారు. ఈ విషయంపై అప్పుడే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేశా. సామాజిక న్యాయం కోసమే ఇటీవలే టీడీపీలో చేరా. ఆ పార్టీ నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. అమలాపురం టీడీపీ ఎంపీ సీటు ఇస్తానని టీడీపీ చెప్పింది. ఆ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చేసా. నా హత్యకు కుట్ర జరిగింది. దీనిపై విచారణ జరిగేలా చూడాలని ద్వివేదిని కోరాను’’ అంటూ హర్ష కుమార్ తెలిపారు.