MLA Bolla Brahmanaidu : గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నట్టుండి మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే ఊరుకోను.. జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఏం తప్పుడు వార్తలు రాశామో చెప్పమని జర్నలిస్ట్ అడగడంతో మరింత స్వరం పెంచారు ఎమ్మెల్యే. దీంతో ఎమ్మెల్యే, మీడియా ప్రతినిధికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రవర్తనతో అసహనానికి గురైన జర్నలిస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వినుకొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని… వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు వెంచర్లు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాంటి వాళ్ల దగ్గర ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని బ్రహ్మనాయుడు సూచించారు.
Bolla BrahmanaiduRead also : BJP manifesto for Bengal elections: బెంగాల్ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు ప్రకటించిన బీజేపీ